About Us
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (గ్రేటర్ హైదరాబాద్) march 2006 వ తేదీన రిజిస్టర్ చేయబడినది.
సమాఖ్య ఆశయాలు:
- బ్రాహ్మణులు సామాజిక, ఆర్ధిక, రాజకీయంగా, అభివృద్ధి సాధించుటకు చర్యలు తీసుకునుట.
- బి ఎస్ ఎస్ ఎస్ జోనల్, నియోజిక వర్గ స్థాయి నుండి, డివిజన్ స్థాయి వరకు కమిటీలు నిర్మాణం చేసి వివిధ కార్యక్రమములు చేపట్టుట
- సామూహిక ఉపనయనములు నిర్వహించుట, పంచాంగములు ముద్రించి, బ్రాహ్మణ బంధువలు అందరికి అందచేయుట
- పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనం అందచేయుట మరియు విద్యా అవకాశాలు కల్పించుట లాంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం.
- పేద బ్రాహ్మణ బంధువుల ఆర్ధిక సంపద పెంపొందించడంలో వారికి బ్యాంకుల ద్వారా రుణము సమకూర్చడానికి కృషి చేయుట
- బ్రాహ్మణులు సొంత వ్యాపారం చేసి వారు స్వయం ప్రతిపత్తితో ఆర్ధికంగా ఎదుగుదలకు కృషి చేయుట
- వశిష్టా కళ్యాణవేదిక, ఎం ఐ సి విభాగమును పటిష్ట పరిచి, వివాహ పరిచయ వేదికలు నిర్వహించుట
- రాజకీయ సమన్వయము సాధించుటకు కృషి చేయుట.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదే విధంగా
- బ్రాహ్మణ ప్రతినిధ్యం గల అన్ని జోన్స్ లోని నియోజకవర్గాలలో బి ఎస్ ఎస్ ఎస్ కమిటీలు నిర్మాణం చేయుట
- ద్వారా రాజకీయ పార్టీలకు సమాన్తరంగా బ్రాహ్మణ ఓటు బ్యాంకును నెలకొలుపుట.
- బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లభించే బెనిఫీట్స్ అందరి పేద బ్రాహ్మణులకు అందేలా కృషి చేయుట


బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య లేదా సంక్షిప్తంగా BSSS, తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2006 మార్చిలో నమోదు చేయబడిన సంఘం. BSSS బ్రాహ్మణ సమాజంలోని బలహీన మరియు అట్టడుగు వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇది తెలంగాణలోని సమాజంలోని నిస్వార్థమైన ఉద్దేశ్యంతో వారి సర్వతోముఖాభివృద్ధికి ఆర్థిక, మేధో మరియు భౌతిక వనరులను అందించడం ద్వారా వారికి సేవలందిస్తుంది. విద్య, వ్యవస్థాపకత, సంక్షేమం మరియు సంస్కృతి మొదలైన రంగాలలో బ్రాహ్మణ సమాజ అవసరాలను తీర్చడానికి BSSS కట్టుబడి ఉంది. పరిషత్ దాని సభ్యులలో సంఘానికి చెందిన భావనను పెంపొందించడానికి మరియు వారి మనోధైర్యాన్ని పెంపొందించడానికి కార్యకలాపాలను చేపడుతుంది.